అలివేలు - రాము కోలా.దెందుకూరు.

Alivelu

గట్టిగా తడితే ఊడి పడుతుందేమో! అనిపించేలా ఉన్న ఇంటి గుమ్మం ముందు, ధారగా పడుతున్న వర్షానికి,తనలో తాను ముడుచుకుంటూ.. ఒంటికి చుట్టుకున్న ప్లాస్టిక్ పట్టాను సరిచేసుకుంటూ. ఎక్కడో అడుగంటి పోతున్న ఆశకు ప్రాణం పోస్తూ.. మాలచ్చమ్మ ఇంటి గుమ్మం ముందు నిల్చుని తటపటాయిస్తునే...చిన్నగా తట్టింది అలివేలు.. నిలబడే ఓపిక క్షణక్షణం కరిగిపోతుంటే.. మూతపడుతున్న కన్నులను బలవంతంగా నిలుపుకుంటూ, మాలచ్చమ్మ పిన్నీ... ఓ మాలచ్చమ్మ పిన్నీ.. అంటు పిలిచే ప్రయత్నం చేసింది అలివేలు. తన మాట తనకే సరిగా వినిపించడంలేదు. గుడిసెలో ఏమూలో ముడుచుకున్న మాలచ్చమ్మకు ఎలా వినపడుతుంది. రివ్యున వీచే గాలికి , ప్రమిదల్లో దీపంలా ఊగిపోతుంది అలివేలు, విడవకుండా కురుస్తున్న వర్షం,వారం రోజులగా తెరపన్నదే లేదు.కాలనీ వాసులందరూ గుడిసెలో కే పరిమితమైపోయారు. రెక్కాడితే కాని డొక్కా నిండని కాలనీ వాసుల్లో అలివేలు ఒకరు. నా అనేవారు ఎవరు లేని అనాధ తను.. తనలాగే ఒంటరిగా జీవించే మాలచ్చమ్మ అంటే అలివేలుకు ఒకరకమైన అభిమానం. మాటామాటా కలుపుకుని సాధక బాధలు చెప్పుకునే చనువు ఉంది ఇరువురికీ. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న. ఆకలిని ఆపుకోలేక,మాలచ్చమ్మ దగ్గర కాసిని బియ్యం అరువు తీసుకుని ఉడకేసుకుంటే, ప్రాణం సర్దుకుంటుంది అనే ఆశతో మాలచ్చమ్మ ఇంటికి వచ్చింది అలివేలు. లోపల మాలచ్చమ్మ ఉలుకు లేక పోవడంతో . తీగలతో కట్టి అడ్డుపెట్టుకున్న చెక్కను జరుపుతూ గుడిసెలో కి అడుగుపెట్టింది అలివేలు.. ****** లోపలకు అడుగు పెట్టిన అలివేలు ,మాలచ్చమ్మ పరిస్థితి కూడా ఇంచుమించుగా తన పరిస్థితిలానే ఉన్నదనే విషయాన్ని అర్దం చేసుకుంది. గుడిసెలో ఓ మూలగా ఉన్న చిన్న కుక్కి మంచంలో లాగితే చిరిగేందుకు సిద్దంగా ఉన్న బొంతను కప్పుకుని ,గొంగళి పురుగులా తనలోకి తాను ముడుచుకుంది మాలచ్చమ్మ.జాగ్రత్తగా చూస్తే కనిపించే పరిస్థితిలో లేదు. మాలచ్చమ్మ దగ్గర కాసిని బియ్యం అరువు తీసుకుందామనుకున్నా అలివేలు ఆశ అగాథం లోకి జారిపోయింది. మాలచ్చమ్మ ..మాలచ్చమ్మా అంటూ తనని తట్టి లేపే ప్రయత్నంలో,అలివేలు ఉలిక్కిపడింది. మాలచ్చమ్మ శరీరం నిప్పులు గుండంలా కాలిపోతుంది. గుడిసెలో ప్రాణాపాయం స్థితికి చేరువలో మాలచ్చమ్మ పోరాటం చేస్తుంది్ గుడిసెలో ఎక్కడా గిద్దెడు బియ్యం కనిపించలేదు. అలివేలు చూపులు గుడిసెలో అనువనువూ గాలిస్తున్నాయి. తన చూపుకు ఫలితం కనిపించింది. దేవుడి పటం దగ్గర ఎర్రగుడ్డలో ముడుపు కట్టి దాచిన కాస్త బియ్యం కనిపించడంతో ,మనసులో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. చకచకా వర్షం నీళ్ళతోనే బియ్యం కడిగి, గిన్నెలో వేసి. చిలక కొయ్యకు వేలాడే ఒత్తుల కుంపటి దించి.మంచం పక్కన ఉన్న మాలచ్చమ్మ పొరచుట్ట సంచికలోనుండి చెకుముకి రాయి తీసి,కొట్టి వెలిగించింది. బియ్యం ఉడుకుతుంటే కాస్త ఉప్పు కూడా వేసింది. గంజితో ఉన్న అన్నం ,సత్తు పల్లెలంలోకి వంచి మాలచ్చమ్మకు కొద్ది కొద్దిగా తినిపిస్తూ,తన ఆకలి మర్చిపోయింది అలివేలు. అలా గంట గంటకూ కాస్త తినిపిస్తూ,తాను కప్పుకున్న పట్టాను కూడా మాలచ్చమ్మకు కప్పేసింది అలివేలు. మూడు రోజులుగా ముద్దులేదు.ఆకలి బాధతో నిద్రపోలేదు.శరీరం పట్టు ఙారిపోతుంది. అలివేలు తనని తాను కోల్పోతుంది. కన్నులు మూతపడిపోతున్నాయ్.గుడిసెలో వారద నీరు చేరుతుంది. పైనుండి పడుతున్న చినుకులకు పూర్తిగా తడిసిపోతుంది. కాస్త వెచ్చవెచ్చగా గంజినీళ్ళతో నాలుగు ముద్దలు కడుపులోకి జారడంతో,మాలచ్చమ్మకు ప్రాణం తిరిగొచ్చినట్లైంది.మెల్లగా నిద్రలోకి జారుకుంది. అలివేలు ప్రాణం ఏక్షణంలో పోయిందో..ఆ దైవానికి మాత్రమే తెలుసు. మాలచ్చమ్మ మంచానికి చారగిల పడిపోయింది. అలివేలు కన్నుల్లో చిన్న తృప్తి..కారణం. ..పాఠకులే తెలియాలి. ఆకలి పోరాటంలో ఒకరికే గెలుపు. ఎదుటివారిని గెలిపించడమే నిజమైన గెలుపు అని భావించే మనస్తత్వం అలివేలిది.

మరిన్ని కథలు

Mister Vinayak
మిస్టర్ వినాయక్
- యిరువంటి శ్రీనివాస్
Window seat
విండో సీటు
- ఎం వి రమణారావ్
Swayam vupadhi
స్వయం ఉపాధి
- మద్దూరి నరసింహమూర్తి
Neelambari
నీలాంబరి
- రాము కోలా దెందుకూరు.
Indradyumnudu
ఇంద్రద్యుమ్నుడు
- కందుల నాగేశ్వరరావు
Vyapari telivi
వ్యాపారి తెలివి
- ౼డా.బెల్లంకొండ & ౼డా.దార్ల
Sundaramidi palle
సుందరామిడి పల్లె
- సి.లక్ష్మి కుమారి
Snehadharmam
స్నేహ ధర్మం
- భానుశ్రీ తిరుమల