నాట్యనమత్తండి కథ - విద్యాధర్ మునిపల్లె

Natyanamattandi katha

కాంచిపురమునందు నటరాజుని వంటి నాట్యనమత్తండి అనే పరమశివభక్తుడు ఉండేవాడు. ఒకనాడు అతడు ఏకాంబరేశ్వరుని గుడికి వెళ్లెను. మహాభక్తితో మహాదేవుని దర్శించెను. ఆయనకుత్తడినయ్యారు. ఆమహాదేవుడు బాలేందుశేఖరునిగా ఫాలలోచనునిగా విరాజిల్లుచుండెను.ఆ దేవదేవుని దర్శించిన మాత్రముచేత హృదయము మహదానందమునొందిన ఆ శివభక్తుడు అచట ఉన్న పూజారిని ఈ విధముగా అడిగెను. ఈశ్వరుని నడుము అటువైపునకు కొంచెం జరిగిఉన్నది. ఈశ్వరుని చేతులేమిటో ఆదొకరకముగా వంకరపోయి ఉన్నవి. మూడు వంకరలచే ఒక పాదముపై శివుడునిలిచి ఉన్నాడు. ఆ పాదము కూడా భూమిపై ఆనినట్లున్నది. ఆ మూడు కనులు విప్పార్చుకొని ఊర్థ్వదృష్టితో ఉన్నాయి. రెప్పలు కనిపించుటలేదు. శివుని శిరస్సుకూడా సరిగా నిలవకుండ అంతా ఒక ప్రక్కకు వాలి ఉన్నది. జటాజూటము విడిపోయినది. ఇదంత చూచుచున్నకొలది చాలా చోద్యముగా కనిపించుచున్నది. దీనికిగల కారణమేమిటి? ఈ ప్రశ్నను వినేసరికి అక్కడ ఉన్న పూజారికి నవ్వువచ్చినది. ఈ భక్తుడు ఎవరో వెర్రివాడువలె ఉన్నాడు అని అనుకున్నాడు ఆ పూజారి. ఆ పూజారి తమాషాగా నవ్వుతూ ఈ శివునికి ఏదోరోగం పట్టుకొనినట్లయినది. వాతదోషకారణముచే అతడు ఇట్లు ఉండెను. వెంటనే ఇతనికి వైద్యం చేయనట్లయితే చాలా ప్రమాదము సంభవించును. ఇంకా ఉపేక్షించిన ఎడల ఇపుడు నీవు చూచు వంకర కలిగిన అవయవములేకాక శరీరమంతా ఎన్నో వంకరలు తిరిగిపోవుటకు అవకాశమున్నది. ఇతనికి రోగము నయం చేయుటకు కావలసిన ఔషధమును నేనుఎరుగుదును. ఆ ఔషధము చాలా విలువలతో కూడినవి కనుక, దానికి తగిన సంపదను తెచ్చిన ఎడల ఆ ఔషధమును కొని తెచ్చెదను. అని పరిహాసముగా పల్కెను ఆ పూజారి. అంత ఆ శివభక్తుడు పూజారి మాటలను నమ్మినవాడై తన ఇంటివద్దనున్న సమస్త సంపదలను పూజారికి ఇచ్చెను. ఈ సంపదలతో ఆ దేవదేవుని రోగమునునివారించిన ఎడల నా కుటుంబము నీకు దాసులము అయ్యెదము అని పరిపరి విధముల పూజారిని వేడుకొనుచుండెను.
శివభక్తుడిచ్చిన సంపదను తీసుకొని కొంత సమయము తరువాతరమ్మని చెప్పెను. శివభక్తుడు మళ్లీ పూజారి వద్దకు వెళ్లగా వాయుతైలమును శ్రేష్టముగా తయారు చేసినాను. దానిని ఉపయోగించి వంట ఔషధమును గొప్పగా సిద్ధము చేసితిని అంటూ ఆముదముతైలము కాస్త నులివెచ్చచేసి చేతికి ఇచ్చెను. ఆ పరమ శివభక్తుడు పూజారి నుంచి తీసుకొనిన నులువెచ్చని ఆముదమును మహాదేవునిపై పూసి మర్ధన చేసెను. శివునకు కాక సోకకుండా వావిరి చివుళ్లు ఉమ్మెత్త చివుళ్లు తంగెడు చివుళ్లు ఈ విధముగా రకరకముల వృక్షముల యొక్క చివుళ్లను మంగళభావుని శరీరమంతట ఔష¸ధముతో అంటించెను.ఆకుపైన వేడిచేసిన ఇసుకను గుడ్డలోకట్టి కాపటం పెట్టెను. అరచేతులను బాగుగా రాచుకొనునట్లు చేసి దానినుంచి వచ్చినవేడిని మహాదేని శరీరముపై ఉంచి కాపుచుండెను. ఈవిధముగా శివభక్తుడు ప్రతిరోజూ స్వామివారికి పుటంపెట్టుచూ స్వామివారి సేవనందే నిమగ్నుడై ఉండెను.పథ్యము చేయుటకు తగిన పదార్థములను మాత్రమే నివేదన ఇస్తూ స్వామిని నిరంతరము వైద్యవిధానమునందే ముంచెత్తుచుండెను. ఇట్లా ఎన్ని రోజులు గడిచిననూ ఆ పరమేశ్వరుని శరీరమున ఎటువంటి మార్పుని చూడలేదు. అప్పుడు శివభక్తుడు ఓపిక పట్టలేక శివుని సమక్షమునకు వెళ్లి తన తలను ఉత్తరించుకొనుటకు సిద్ధమయ్యెను. అంతలో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యెను. ఆ నాట్యనమిత్తండిని ప్రేమతో కౌగలించుకొనెను. ఓమహానుభావా! నీకేమి కావాలి చెప్పు? నీకిచ్చెదను అని వరములు కోరుకోమని అనెను. అప్పుడా పరమభక్తుడునాకు వరములు ఏమియునూ ఈయనక్కరలేదు. ఈ దివ్యధాముని యొక్క శరీరమునకు గల వంకరల పెరగకమునుపే ఆ దేవదేవుని సహజస్వరూపుగా మార్చగలవు. అసలింతకు ఈ లింగమునకు సంక్రమించిన అస్వస్థత యేమి? అసలిది సహజస్వరూపమేనా? అని పరమేశ్వరుని అడిగెను. ఓభక్తా! ఈ లింగస్వరూపము తాండవమును సూచించునది. నాట్యం చేయునపుడు నారూపము ఈ లింగమునందున్న రూపమును పోలి ఉండును. నాట్యము చేయు సమయమున నేను ఢమరుక శబ్ధధ్వనిని మ్రోగించుచు హా! యని అరుచుచూ మనసు తదాత్మ్యమును పొందుచూ అపుడు నా పాదమును ఊర్థ్వముగా ఎత్తుదును. మువ్వలును, గంటలును గణగణ...ధనధన ఉఛ్చైశ్వరముతో మ్రోగుచుండగా నామార్థదేహమును పాదరికానగా మహాద్భుత కరతాడనాల వలన దిక్కులన్నీ చెదరిపోగా వడివడిగా మహాఉచ్ఛ్వాసనిశ్ఛ్వాసవలన శరీరమంతా కంపించిపోగా గజ్జెల శబ్దమునకు ఢమరుక శబ్ధమునకు గంటల శబ్దమునకు అనువగు రీతిన అడుగులు వేయుచూ తీవ్రాటోపవేగములో గిఱ్రున తిరుగుచూ నిలబడె భంగిమలో కాళ్లను నిలద్రొక్కుకొనుచూ, పాదాగ్రంమీద నిలిచి నటిస్తున్న సమయమున ఏ రూపమునుండునో ఆ రూపము ఇపుడు ఈ ఏకాంబరేశ్వరుని రూపమై ఉండును. నా భక్తులు ఈ తాండవాకృతుని ప్రీతితో చూచినచో మనోరంజక రూపముగా భక్తితత్త్వమును నా యందుగ్రోలుటకు అనుకూలమై ఉండుటచే ఈ ఆకృతిలో ఇక్కడ వెలిసితిని. అని పలుకుచూ తమయందు అతులితమైన అనురాగములో అనుపమjైున ముగ్థత్వభక్తిలో నీవు నా మనసుని ఆకర్షించుటచే నీకు మోక్షమును ఇచ్చుచున్నాను అని, బంగారు విమానంపై ఎక్కించుకొని కైలాసమునకు తీసుకొనిపోయెను.
ఈ కథనందునాట్యశాస్త్ర రీతులను వివిధవైద్యశాస్త్ర సంబంధ విషయములను తెలియజెటప్పుటచే ఈ కథ మనోరంజనమును శాస్త్రీయ నాట్యదృష్టిని కలిగించునటుల మనకు తెలియవచ్చుచున్నది. ప్రతిఫలమును ఆశించక సేవ చేసిన యెడల అపారశక్తి సంపదలను పొందవచ్చును అని లోకోపకారక ఉపదేశమును ఈ కథాంశము ద్వారా తెలుసుకొనవచ్చును. స్వార్థప్రయోజనములకై లేదా పరాచకమునకై కూడా పరమభక్తులను మోసము చేయుటకు ప్రయత్నించినను వారూ మోసపోక తప్పదని పరమభక్తితత్త్వమును మధించుటకు తన్మయులై లోకకీర్తిని పొందుటకు తగిన అవకాశముగా మలచుకొందురు అని, ఈ కథాంశము నాట్యనమత్తండి పాత్రద్వారా తెలియజెప్పుచున్నది. పరమేశ్వరునకు సేవచేయుటకై తన సర్వస్వమును అర్పించుటచే స్వచ్ఛభక్తితత్త్వం ఋజువగుచున్నదని గ్రహింపవచ్చును.ఈ విధముగా అనేక సామాజిక బాధ్యతలను నాట్యశాస్త్ర సంబంధమగు విషయములను వైద్యశాస్త్ర సంబంధము అనుసంధానింపబడి మనకందించుటచే ముగ్ధభక్తులలో నాట్యనమిత్తండి కథ స్థిరముగా నిలిచెను.

మరిన్ని కథలు

Baamma cheppina bhale kathalu
బామ్మ చెప్పిన భలే కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bandham Anubandham
బంధం అనుబంధం
- కందర్ప మూర్తి
Aaradhana
ఆ'రాధ'న
- కొడాలి సీతారామా రావు
Pagavadiki koodaa ee anubhavam vaddu
పగవాడికి కూడా ఈ అనుభవం వద్దు
- మద్దూరి నరసింహమూర్తి
Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ