 
                                        భువనగిరిని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.
ఒకరోజు రాజసభలో ,తలపైన గాయంతో ప్రవేసించిన శునకం " మహరాజుల వారికి జయము జయము. ప్రభు ధర్మమూర్తులు,
న్యాయపాలకులు,దాతలు అయిన తమ పాలనలో నాకు అన్యాయం జరిగింది. రాత్రంతా చలికి గజగజలాడుతూ నిద్రకు దూరమైన నేను, ఉదయాన్నే వచ్చే సూర్యభగవానుని కిరణాల వెచ్చదనంలో హయిగా నిద్రిస్తున్ననన్ను అకారణంగా గాయపరిచిన వ్యక్తిని తమరు నన్ను అకారణంగా గాయపరిచిన వ్యక్తిని తగువిధంగా నెనే శిక్షించే అవకాశం కలిగింప కోరుతున్నాను " అన్నది.
" శునక రాజమా మాపాలనలో దనవంతులు,పేదవారు, పండితులు,
పామరులు అనే భేదం ఉండదు. అందరికి ఒకటే చట్టం అందరికి ఒకటే న్యాయం. నిన్నఇలా ఎవరు గాయపరిచారు? వారి విలాసం, నామధెయం ఏమిటి " అన్నాడు వీరసింహుడు.
" ప్రభు తూర్పు రాచవీధిలోని రంగనాధం గారు ,నిద్రిస్తున్న నన్ను తన చేతి కర్రతో అకారణంగా గాయపరిచారు " అన్నది శునకం.
రంగనాధాం వారిని సభమండపానికి పిలిపంచి "పండితోత్తమా తమరు మీచేతికర్రతో ఈశునకాన్ని అకారణంగా గాయపరిచారని మీపై ఆరోపణ ఉంది దీనికి మీసమాధానం ఏమిటి " అన్నాడు వీరసింహుడు.
" ప్రభు దైవదర్శనానికి వెళ్ళడానికి ఇంటి తలుపుతీయగానే వాకిలికి ఎదురుగా వీధిలో ఈనల్ల శునకం నిద్రపోతూ కనిపించింది,వీధిలోనికి వెళుతూ గుమ్మానికి ఎదురుగా అందనీ నాచేతి పొన్నుకర్రతో అదిలించాను అది గాయంచేస్తుందని ఊహించలేదు. తెలిసిచేసినా,తెలియకచేసినా అదినాతప్పిదమే అందుకు తగినశిక్ష అనుభవించడానికి సిధ్ధమే " అన్నాడు రంగనాధం.
" శునక రిజమా రంగనాధంగారు తనతప్పిదాన్ని అంగీకరిస్తున్నారు.
కనుక వారికి ఎటువంటి శిక్ష అయినా నీవు విధించవచ్చు, నీవు ఇచ్చె తీర్పు తక్షణం అమలు జరుగుతుంది " అన్నాడు మహరాజు.
" ప్రభు ఈరంగనాధం గారిని ఏదైనా పెద్ద దేవాలయానికి శాశ్విత ధర్శకర్తగా తక్షణం నియమించండి "అన్నది శునకం.
శునకం తీర్పువిని సభలోనివారంతా ఆశ్చర్యపోయారు.
" మంత్రివర్య శునం మాటలు విన్నారుకదా ,తక్షణం రంగనాధంవారిని ఒకపెద్ద ఆలయానికి శాశ్విత ధర్మకర్తగా నియమించండి " అన్న మహరాజు
"శునకరాజమా అపకారికి ఉపకారం అంటే ఇదే,నిన్ను వారిని శిక్షించకుండా వారికి పదవి కట్టపెట్టడంలో నీఅంతర్యం ఏమిటో అర్ధం కాలేదు" అన్నాడు మహరాజు.
" ప్రభూ నేను గతజన్నలో గొప్పపండితుడను, ఒక ఆలయధర్మకర్తగా ఉన్నాను. ఒకరోజు రాత్రి ఆలయంలో ,నాసమీపంలోని ప్రమిదలో వెలుగుతున్న వత్తి గాలికి రెపరెప లాగసాగింది. గాలికి దీపం ఆరిపోకుండా నాకుడిచేతిని ఆదీపానికి అడ్డుగా ఉంచాను.అప్పుడు ఆప్రమిదలోని నూనె నాచేతికి కొద్దిగా అంటుకుంది ,చేతికి అంటిన నూనెను ఏంచేయాలో తెలియక తలపైన రాసుకున్నాను. ఆలా తెలియక భగవంతునీ సొమ్ము నేను వాడుకున్నందుకు,నాకు ఈజన్మలో శునకంగా పుట్టాను. రంగనాధం కూడా భగవంతుని ఆలయంలో,తెలిసి ఏదైనా తప్పుచేస్తాడు'లేక తప్పుచేసేవారిని ఉపేక్షిస్తాడు, అప్పుడు మరుజన్మలో నాలా శునకంగా జన్మిస్తాడు. అప్పుడు తెలుస్తుంది శునకజన్మ ఎంత దుర్బరమైనదో, ఆకలి,దాహానికి ,ఎండా,వాన,చలి అనుభవిస్తూ తనుచేసిన తప్పును తెలుసుకుని చింతిస్తాడు. ఇది తెలిసిన ప్రజలు అందరూ, దేముని సొమ్ముకాని, పరులసొమ్మకాని దొంగతనం చేయాలంటే భయపడతారు " అన్నది శునకం.
సభలోనివారంతా శునకం తీర్పును హర్షించారు.









