ఆసరా! - రాము కోలా. దెందుకూరు

Aasaraa

రామయ్య చిరువ్యాపారి. గల్లీలో ఉదయం ఆరు గంటలకే కూరగాయల బండి పెట్టేవాడు అదే అతనికి జీవనాధారం.. రోజుకి రెండుమూడు వందల రూపాయలు సంపాదించి, భార్య పార్వతి, ఇద్దరు పిల్లలతో తృప్తిగా జీవనం గడిపేవాడు. అతని మంచితనము, మాట తీరు పలకరించే విధానం అందరినీ ఆకట్టుకునేది. అదే అతన్ని ఆపద సమయంలో ఆదుకునేందుకు సహకరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతని పూరిల్లు నేలమట్టం అయింది. ఎవరిని ఆశ్రయం కొల్లేటి పరిస్థితి.మరో పక్కనే కుటుంబ. రెక్కాడితే కానీ డొక్కా నిండని పరిస్థితి. ఏం చేయాలో తోచక దిగాలుగా చెట్టు కింద కూర్చుని ఉన్న రామయ్యని దూరం నుండి చూసాడు శ్రీనివాసరావు. శ్రీనివాస్ రావు మున్సిపల్ ఆఫీసులో క్లర్ జాబ్ చేస్తుంటాడు.తనది కూడా మధ్యతరగతి కుటుంబమే.అందుకే తనకు కావలసిన కురగాయలు రామయ్య దగ్గర కొనేవాడు.పరోక్షంగా అతనికి సహాయం చేసినట్లు ఉంటుందని. ఇప్పుడు రామయ్య పరిస్థితి చూడగానే శ్రీనివాసరావు గుండె తరుక్కపోయింది. రామయ్యా..వర్షం కారణంగా నీ ఇల్లు కూలిపోయిందని తెలిసింది. పిల్లలు కలవాడివి ప్రస్తుతం ఎక్కడ ఉంటావు. నా ఇంటి ఆవరణలో ఖాళీ జాగా ఉంది. ప్రస్తుతం.అక్కడ నీ బండి పెట్టుకోవచ్చు. నాలుగు రోజులు తర్వాత ఏదైనా బ్యాంకులో లోన్ ఇప్పిస్తాను. ఇప్పుడు తాత్కాలికంగా నాలుగు రేకులతో నివాసం ఏర్పాటు చేద్దాం. వెళ్ళి పిల్లల్ని, నీ భార్యని తీసుకుని వచ్చేయి అని భరోసా ఇచ్చాడు. రామయ్యా గొంతు మూగబోయింది. “సార్... మీ దయ జన్మజన్మలకూ మర్చిపోను,” అని చేతులు జోడించాడు. కాలం క్రమేణా రామయ్య జీవితం మారింది. వ్యాపారం పుంజుకుంది. బ్యాంకులో ఉన్న అప్పు తీర్చేసాడు. ఎంత పని వత్తిడి ఉన్నా సాయంత్రం శ్రీనివాసరావు గారు వచ్చే వరకు ఉండి నాలుగు మాటలు మాట్లాడి తన కూరగాయలు బండి పక్కన పెట్టిన వెళ్ళేవాడు. అలా కూర్చునిఒక రోజు మాట్లాడుతూ శ్రీనివాసరావు గుండెపోటుతో నేలపై కుప్పకూలిపోయాడు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. పండుగకు ఊరికి వెళ్ళారు. సమయం లేదు. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూంది. శ్రీనివాసరావు ఆటోలో ఆసుపత్రికి పరుగు పెట్టాడు. “సార్... మీరు లేకపోతే నేను లేను!” .మీరు కోలుకోవాలి.నాలాంటి వారిని ఎందరినో ఆదుకోవాలి.... దేవుడా!....సార్ త్వరగా కోలుకునేలా చేసే బాధ్యత నీదే. అలాగే చేస్తావు కదా!.అని కాళ్ళపై కూర్చుని దైవాన్ని వేడుకున్నాడు. మరుసటి రోజు మంచం మీద శ్రీనివాసరావు కళ్లు తెరిచాడు. దగ్గరలో రామయ్య కనిపించాడు. ఏం జరిగింది శ్రీనావాసరావుకు ఒక్కోక్క టి గుర్తు రాసాగింది. రామయ్యా పి దగ్గరకు రమ్మంటూ పిలిచి,రామయ్య చే చేతులు తన చేతుల్లోకి తీసుకొని “రామయ్య... నువ్వు లేకపోతే నేను చచ్చేవాణ్ణి,” నువ్వు నా పాలిట దేవుడివి. నీ ఋణం ఎన్ని జన్మలకు తీరుతుందో. అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. రామయ్యా చాలించి పోయాడు. . కళ్లలో నీళ్లు పొంగాయి. “సార్... మీరు నాకు ఆసరా కల్పించిన దేవుళ్ళు. ఈ రోజు నేను నాలుగు రామారావు సంపాదిస్తూ కుటుంబంతో సంతోషంగా ఉన్నానంటే అది మీ సహకారమే. మీకు సేవ చేసే భాగ్యం నా అదృష్టంగా భావిస్తున్నాను. ,” అని చేతులు పట్టుకున్నాడు. మానవత్వం అంటే ఇదే – ఇవ్వడం, ఆదుకోవడం, ఒకరి కన్నీటిని మరొకరు తుడవడం.అని తెలియచేస్తూ గోడ గడియారం టంగ్ టంగ్ మంటూ మ్రోగింది.

మరిన్ని కథలు

Ichhanamma vayanam-Puchhukunnanamma vayanam
ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyapara marmam
వ్యాపార మర్మం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Annalu mechharu
అన్నలు మెచ్చారు
- కొడాలి సీతారామా రావు
Aapada bandhuvu
ఆపదభంధువు
- కొడాలి సీతారామారావు
Antaa manchike
అంతా మంచికే
- కొడాలి సీతారామా రావు
Podupu baata
పొదుపు బాట.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nyayam jarigindi
న్యాయం జరిగింది
- సి.హెచ్.ప్రతాప్