పద్మినీ పరిణయం - Anisa Tabassum sk

Padmini parinayam

సమయం సాయంత్రం నాలుగవుతుంది.సూర్యుడు మబ్బుల వెనుక దాక్కుంటూ ఆకాశాన్ని నారింజ, బంగారు రంగులతో అలంకరించాడు. ఆ అలంకరణకు భంగ పరుస్తునట్టు నల్లని మబ్బు పట్టేసింది.చల్లని గాలితో చాల ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారింది వాతావరణం. పచ్చని చెట్ల ఆకులపై నుంచి జారిపడుతూ నేలను మెల్లగా ముద్దాడుతున్నాయి వర్షపు చినుకులు. జనసంచారం లేని చోటు,చుట్టూ దట్టమైన చెట్లతో, పొదలతో ఉన్న ఒక పాత కోనేరు ఉంది.ఆ కోనేరు నీటి మీద తేలియాడుతున్న కలువ పువ్వులు. కొన్ని కలువలు విచ్చుకొని వర్షాన్ని ఆహ్వానిస్తుంటే మరి కొన్ని అలకతో ముడుచుకున్నాయి. ఇంతలో ఆ కోనేటి నీటిలో ఏదో పడ్డట్టు దబ్... అని శబ్దం వచ్చింది.కొన్ని క్షణాలకి పైకి తేలింది తమర పువ్వులాంటి అమ్మాయి.తడిసిన పొడవాటి జుట్టు,కలువ రేకులంటి కళ్లు,మొనతేలిన ముక్కు పై తళుక్కు మనిమేరిసే వజ్రపు ముక్కుపుడక.రాణి రంగు రవిక - చిలక పచ్చ పరికిణి,గులాబీ రంగు పెదాలతో నవ్వుతుంటే అక్కడున్న కొలను అందాలతో పోటీ పడుతుంది ఆమె అందం. ఆ అమ్మాయే పద్మిని, అమాయకురాలు...మంచి మనసున్న అమ్మాయి. ఆ జల్లులో, కోనేటి నీళ్లతో మైమరిచి ఆడుకుంటున్న పద్మినిని.అప్పుడే అక్కడకు వచ్చిన ఆరడుగుల కుర్రాడు,తన భుజాన ఉన్న సంచిని నేలమీద జారవిడిచి, అతని కుర్తా తీసి తనుకూడా కోనేటిలోకి దూకి పద్మిని ఎంతో ప్రేమగా ఎత్తుకొని బయటికి వచ్చాడు. అతగాడే మురళి. పక్క ఊరిలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. అతని వృత్తికి తగట్టే మురళికి ప్రేశ్నించే స్వభావం, తన కళ్ల ముందు అన్యాయం జరిగితే ఎదురుగ ఎంతటి వారు ఉన్నా ఊరుకోడు. చెట్టు కింద ఉన్న బెంచీ పై పద్మిని కూర్చోబెట్టి....."ఎన్ని సార్లు చెప్పాలి ఇలా నీటిలో తడవొద్దు అని" అంటూ... తన సంచిలో నుంచి పేపర్ తో చుట్టి ఉన్న దాన్ని పద్మినికి అందించాడు. తెరిచి చూసి 'నేను అడిగిన నీలం మట్టిగాజులు!! అంది చిరునవ్వుతో చూస్తూ... పద్మిని పక్కకి కూర్చొని, తన చెయ్యి అతని చేతిలోకి తీస్కొని అతి సున్నితంగా ఆ గాజులు తొణుగుతున్నాడు మురళి. పద్మిని-మురళిది ఇనాటి ప్రేమ కాదు. వీళ్లిద్దరు వారి 8వ తరగతి నుంచే ఒకరినొకరు ఇష్టపడటం మొదలు పెట్టారు. వీరి మధ్య ప్రేమ కూడా వీరితో పాటే పెరిగింది.కాకపోతే వీరు ప్రేమించుకుంటున్నట్టు అప్పుడు-ఇప్పుడు మూడో కంటికి తెలీదు. కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు కలుసుకునే చోటు ఈ కోలనే. వీరి ప్రేమ,మధుర జ్ఞపకాలు, అలకలు,బుజ్జగింపులు, బాధలు కేవలం ఈ కోనేరుకి,ఇక్కడ కాపురం ఉంటున్న పక్షులకి మాత్రమే తెలుసు. ఎన్ని అనుకున్న ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేరు ఈ మురళి-పద్మిని. పద్మిని మురళిది ఒకే ఊరు *హంసలదీవి*. పద్మిని కూడా మురళి పనిచేసే పక్క ఊరిలోనే టీచర్ గ పని చేస్తుంది. ఉదయం బస్సులో వెళ్లి సాయంత్రం మల్లి బస్సుకి వస్తారు ఇద్దరు, కానీ అసలు ఒకరికింకొకరు పరిచయం లేనట్టుగానే ఉంటారు. ఇలా ఉండడానికి గల కారణం పద్మిని నాన్న భూషణం. ఆ హంసలదీవి ఊరి జమీందారు మరెవరో కాదు పద్మిని నాన్న భూషణమే....అహంకారానికి,అన్యాయాలకు,దుర్మార్గానికి నిలువెత్తు రూపం భూషణం.ఒక్క మాటలో ఆ ఊరికి పట్టిన పీడా అనొచ్చు. భూషణానికి ఉన్న భూమిలో సగానికి పైగా పేదవారిదెగ్గర,అమాయకుల దెగ్గర లాక్కునే భూమే. భూషణంకి ఒక కొడుకు (పేరు సురేంద్ర ) ఒక కూతురు(పద్మిని). ఇంకో కవిత అనే కూతురు కూడా ఉండేది...ప్రేమించిన కారణంగా కన్నా కూతురన్న కనికరం లేకుండా భూషణం,తన కొడుకు సురేంద్ర కలిసి పాపం విషం పెట్టి చంపేశారు. ఆ తరువా కవిత ప్రేమించిన అబ్బాయి కూడా కనిపించకుండా పోయాడు. పద్మిని మురళిది ఒకే ఊరు *హంసలదీవి*. పద్మిని కూడా మురళి పనిచేసే పక్క ఊరిలోనే టీచర్ గ పని చేస్తుంది. ఉదయం బస్సులో వెళ్లి సాయంత్రం మల్లి బస్సుకి వస్తారు ఇద్దరు, కానీ అసలు ఒకరికింకొకరు పరిచయం లేనట్టుగానే ఉంటారు. ఇలా ఉండడానికి గల కారణం పద్మిని నాన్న భూషణం. ఆ హంసలదీవి ఊరి జమీందారు మరెవరో కాదు పద్మిని నాన్న భూషణమే....అహంకారానికి,అన్యాయాలకు,దుర్మార్గానికి నిలువెత్తు రూపం భూషణం.ఒక్క మాటలో ఆ ఊరికి పట్టిన పీడా అనొచ్చు. భూషణానికి ఉన్న భూమిలో సగానికి పైగా పేదవారిదెగ్గర,అమాయకుల దెగ్గర లాక్కునే భూమే. భూషణంకి ఒక కొడుకు (పేరు సురేంద్ర ) ఒక కూతురు(పద్మిని). ఇంకో కవిత అనే కూతురు కూడా ఉండేది...ప్రేమించిన కారణంగా కన్నా కూతురన్న కనికరం లేకుండా భూషణం,అతడి కొడుకు సురేంద్ర కలిసి పాపం విషం పెట్టి చంపేశారు. ఆ తరువా కవిత ప్రేమించిన అబ్బాయి కూడా కనిపించకుండా పోయాడు. పద్మిని అంత అందంగా ఉన్న, ఆ భయంతోనే ఊర్లో ఎవ్వరు పద్మిని వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయరు. మురళికి తెగింపు ఎక్కువ. ఒకసారి సురేంద్రతో కూడా తగువుకి వెళ్ళాడు... అప్పట్నుంచే పద్మిని మురళిని ఇష్టపడటం మొదలెట్టింది. కష్టాల్లో ఉన్నవారికి తన సొంత డబ్బులు ఖర్చు చేసైనా ఊర్లో చిన్న చిన్న అవసరాలు తీర్చడం, బాల కార్మికులను బడిలో చేర్పించడం చేస్తాడు. ఇందువల్లేనేమో పద్మినికి మురళి అంటే అంత ఇష్టం ఏర్పడింది. ఒకరోజు కోనేరు దెగ్గర కలిసి మాట్లాడుకుంటున్నపుడు,మురళి ఇలా అంటాడు " పద్దు...మీ ఇంట్లో ఎలాగో మన పెళ్ళికి ఒప్పుకోరు, నువ్వా ఇంకొకరిని పెళ్ళాడలేవు!! నన్ను నమ్మి నాతో వచ్చేయొచ్చు కదా పద్దు...నా కళ్ళల్లో పెట్టుకొని చూస్కుంటా" అని ప్రేమగా అడిగాడు. "ఆహా...మా నాన్న నేను చెప్తే అర్ధం చేసుకుంటాడు,నువ్వు అనుకుంటున్నంత చెడ్డవాడు ఏమి కాదు మా నాన్న" అంటూ కొంటెగా...కోనేటి నీళ్లు తన చేతితో మురళి మొఖం పై విసిరింది. నా మాట ఎప్పుడు విన్నావని అంటూ...తన కుర్తా జేబులో నుంచి పట్టిలు తీసి పద్మిని కాలు తన ఒడిలోకి తీస్కొని పట్టిలు పెడుతూ " పద్దు...నేను పనిమీద నాలుగు రోజులు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి,నేను తిరిగి వచ్చేవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను పని పూర్తి చేసుకొని వెంటనే తిరిగి వస్తాను" అన్నాడు. ఆ మాటలు విన్న పద్మినికి కలవరం మొదలయింది.వీలైనంత తొందరగా తిరిగిరమ్మని కొంత భయంతోనే పంపించింది పద్మిని. నాలుగోవ రోజు పద్మిని కోనేరు దెగ్గరకు వెళ్ళింది. ఎంత ఎదురుచూసిన మురళి రాడే ....మురళికి ఏమైందో ఏంటో అని కంగారు మోదయ్యింది.మురళి ఎప్పుడు ఇలా చేయలేదు.ఎప్పుడు తాను చెప్పిన సమయానికి వచ్చేస్తాడు. ఈసారి మురళి రాకపోయేసరి ఇంటికి వెళ్లే సమయానికి మించి ఎదురు చూసింది పద్మిని. అయినా నిరాశే మిగిలింది. అదే భయంతో ఇంటికి చేరింది. ఇంట్లో అడుగు పెట్టగానే పద్మిని చెంప ఛెళ్ళు మనిపించాడు భూషణం.చెంపల మీదగా జారుతున్న కన్నీళ్లతో తలదించుకుని మౌనంగా నించుంది పద్మిని. "౩౦ నిముషాలు ఎందుకు ఆలస్యం అయింది?ఎక్కడ తిరిగి వస్తున్నవే!!..అని ఆవేసంతో అరిచాడు భూషణం. "రేపటి నుంచి బడిలో పరీక్షలు నాన్న, ఆ పనిలో ఆలస్యం అయింది" అని భయపడుతూనే బదులిచ్చింది పద్మిని. "ఊర్లో చేసిన సేవలు చాలు ఇంకా నువ్వేమి ఉద్దరించాల్సిన అవసరం లేదు పో లోపలికి" అన్నాడు కోపంగా. వడి వడిగా తన గదిలోకి వెళ్తున్న పద్మిని పైపు చూస్తూ...ఆగవే!! రేపు నిన్ను చూసుకోడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు" అని కాస్త చిరాకుగానే అన్నాడు. ఎదురు మాట్లాడితే ఇంకేం అంటాడోనని ఏడుచుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఆడవారు పద్మిని ఓదార్చడానికి ఆమె వెంటే వెళ్లారు. భూషణానికి ఎదురు చెప్పే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు.పద్మిని అంత చదువుకొని ఉద్యోగం చేయడం కూడా అతనికి ఇష్టం లేదు,భూషణం తల్లి, భూషం తోబుట్టువులు "మన అమ్మాయిని ఎవడు కన్నెత్తి చూస్తాడ్రా, అదేదో చేదాం అనుకుంటుందిగ చేయని మళ్ళి పెళ్ళైతే ఇంటిని సంసారాన్ని చుస్కోడంలో పడుతుంది" అని చెప్తేగాని ఒప్పుకోలేదు భూషణం. ఉదయం కాకూడదు అని కోరుకున్న సూర్యుడు ఉదయించాడు. ఇష్టం లేకపోయినా వేరే దరి లేక తల వంచింది పద్మిని.భూషణానికి తగ్గ సంబంధం కుదుర్చుకున్నాడు. నేరేడుపండు రంగు చీరలో,నాగుపాము లాంటి జడలో కనకాంబరం పూల మాల పెట్టుకొని, అరవంకీలు, వడ్డాణం పెట్టుకొని కల కళలాడున్న పద్మిని ఎవరు కాదంటారు.ఆ అబ్బాయి వాళ్ళకి నచ్చి ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు. ఎం చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో ఉంది పద్మిని. అలాగని మురళిని కాదని మరొకరితో పెళ్ళాడలేదు. ఈరోజు ఎలాగైనా మురళిని కలిసి జరిగింది చెప్పాలి అనుకుంది .కానీ ఈ పరిస్థితుల్లో కోనేరు దెగ్గరకు వెళ్లేదేలా!! కాసేపటికి తన తల్లి దెగ్గరకు వెళ్లి "అమ్మ మనసేం బాలేదే...నేను గుడికి వెళ్ళొస్తాను" అని చెప్పి బాలుదేరింది. వడి వడి కోనేరు దెగ్గరకు చేరుకుంది. ఈ రోజు మురళి అలాగైనా వస్తాడు అని తెలుసు. తాను కోనేరు దెగ్గరకు రోజు కంటే ఆలస్యంగానే వెళ్ళింది. చుట్టూ చుసిన మురళి కనిపించలేదు.ఇంకాసేపు చూదాం అనుకుంది, ఎంత ఎదురుచూసిన పద్మినికి నిరాశే మిగిలింది. ఆ దిగులుతోనే ఇంటికి చేరుకుంది. తన గదిలోకి వెళ్లి తలుపు మూసేసింది. మనసులో భారంగా ఉన్న తన బాధ కన్నీళ్ల రూపంలో ధారాలై వస్తుంది. మదిలో ఏవేవో ఆలోచనలు,వాటితో పాటు మురళి ఆమెను ఎక్కడ మోసం చేసి వెళ్లాడోనన్న భయం. ఇంకొకరిని పెళ్ళాడి తాను బ్రతికేదేలా? మురళి లాంటి అబ్బాయి దూరమైపోతే? తన ఇల్లే తనకు నరకం అనుకుంటే ఆ కుదుర్చుకున్న సంబంధం కూడా తన అలాంటిది. ఎన్నో ఆలోచనలతో,భయంతో నలిగిపోతుంది పద్మిని. మరుసటి రోజు ఎప్పటిలానే బడికి వెళ్లబోతుంటే భూషణం ఆపేసాడు. "నీకు మొన్నే కదా చెపింది సంఘా సేవలు చాలు అని మళ్ళి ఎక్కడికి బయలుదేరావు'. మానేసే ముందు కొన్ని సంతకాలు చేయాల్సి ఉంది నాన్న, ఇవాళ ఒక్క రోజు వెళ్లి వస్తా' అంది. కాసేపు మౌనంగా ఉండి..సరే తొందరగా వచ్చేయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. పద్మిని తొందర తొందరగ బడిలో పనులు పూర్తిచేసుకొని. కోనేరు దెగ్గరకు వెళ్ళింది. కోనేరు మెట్లపై కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ...ఒక నిర్ణయానికి వచ్చింది.' ఈ రోజు మురళి రాకపోతే అదే కోనేట్లో మునిగి చచ్చిపోవాలి అనుకుంది. ఎందుకంటే ఇష్టంలేని పెళ్లి చేసుకొని ప్రతి రోజు నరకంలో బ్రతకడం కన్నా చావడం మంచిది అనుకుంది. మెల్లగా కదులుతున్న కోనేటి నీళ్లను చూస్తూ ఆలోచనలో పడింది. ఇంతలో ఎవరో పద్మిని వెనకనుంచి చేతులతో ఆమె కళ్ళను మూసి పట్టుకున్నారు.' ఎవరు....ఎవరది....అంటూ అరుస్తూ ఆమె బలమంతా ఉపయోగించి ఆ చేతులను పక్కకు తోసేసింది. తిరిగి చూస్తే అది మరెవరో కాదు పద్మిని మనసారా ప్రేమించిన మురళి. మురళిని తన కళ్ళ ఎదుట చూడగానే కోపం, బాధతో కన్నీళ్లు ఆగలేదు. వెంటనే మురళిని కవీగిలించుకొని తన బాధను కన్నీళ్లు రూపంలో చెప్తూ ఏడవడం మొదలు పెట్టింది. మురళి ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.' నన్ను క్షమించు పద్దు, వెళ్లిన పని పూర్తికాకపోవడంతో మరికొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది...మరోసారి ఇలా జరగకుండా చూస్కుంటా' అని చెప్పగా కొంచం ఉరుకుంది. కన్నీళ్లను తుడుచుకుంటూ, మురళి ఊర్లో లేనప్పుడు జరిగిన సంగతులు చెపింది. తాను ఈ రోజు తిరిగి రావడం మంచిదైంది అనుకున్నాడు. పద్దు నువ్వు మరొకరిని పెళ్ళాడి ఉండగలవ? అన్నాడు. నీకు తెలీదా మురళి నేను ఉండలేనని అంటూ కోపంగా బదులిచ్చింది. పోనీ మన ప్రేమ విష్యం మీ నాన్నకి చెప్తే మన పెళ్ళికి ఒప్పుకుంటాడ?.... ఉహుఁ...అని బదులిచ్చింది ముఖం పక్కకు తిప్పుకుంటూ. మరి మనం ఎం చేదాం!! నన్ను నమ్మి నాతో రాగలవ? అని అడిగాడు. అందుకు అవునన్నట్టు తలాడించింది పద్మినీ. సరే ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే ఊహించ. మొన్న పని మీద వీలుంది కూడా అందుకే. మనకి ఇబంది కాకూడదని ఆ ఊర్లోనే ఇల్లు తీసుకున్న. నిన్ను కలిసి ఈ విషయం చెప్దామని ఆగాను. పద్మిని ఆశ్చర్యపోయి వింటుంది మురళి మాటల్ని. మరి ఉద్యోగం? అని అడిగింది. ఆ ఊర్లోనే ఉద్యోగం చూస్కుంటా అందాకా ఖర్చులకి నేను దాచిన డబ్బులు ఉన్నాయ్,వాటితో సరిపెట్టుకుందాం అని బదులిచ్చాడు. కొత్త ఆశలతో, కొత్త జీవితం మొదలు పెట్టాలని ఆ కోనేరు ఇక సెలవు చెప్పి బయలుదేరారు మురళి,పద్మిని. ఈ విష్యం తెలుసుకున్న భూషణం కోపంతో అలానే కూర్చుండిపోయాడు. ఇంట్లో ఆడవారు " పోనిలే ఈ నరకం నుంచి బయటపడి తానైన సంతోషంగా ఉంటుంది'అనుకున్నారు. **కథ సమాప్తం**

మరిన్ని కథలు

Vidhivanchitha
విధివంచిత
- రాపాక కామేశ్వర రావు
Anavayoteetho abdhikam
ఆనవాయితీతో ఆబ్దికం
- మద్దూరి నరసింహమూర్తి
Gunthala Raju
గుంతల రాజు!
- - బోగా పురుషోత్తం
Adrustavanthulu
అదృష్టవంతులు
- యు.విజయశేఖర రెడ్డి
Adarsha kutumbam
ఆదర్శ కుటుంబం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vennante Kallu
వెన్నంటే కళ్లు
- కందర్ప మూర్తి
Manchi Donga
మంచి దొంగ
- చలసాని పునీత్ సాయి