వాట్సాపు గ్రూపులు - చంద్ర శేఖర్ కోవూరు

whatsapp groups

రోడ్డు మీద వెళ్తూ ఆయిల్ ఫై స్కిడ్ అయి పడిపోయిన వ్యక్తి తన దారిన తాను వెళ్లకుండా ఆయిల్ ఫై మట్టి పోస్తూ వెనక వచ్చేవాళ్ళకి చెప్తూ ఉంటాడు చూసి వెళ్ళమని ఎందుకంటే తనలాగా ఇంకెవరు పడకూడదని. అలాగే ఇదొక చిన్ని ప్రయత్నం . అపుడెపుడో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఉదయాన్నే లేవగానే అరచేతులు రుద్ది చూసుకోమని లేదా దేవుని ఫోటో చూడమని. ఇపుడు ఆలా చెప్పేవాళ్ళు లేరు తెలిసిన వాళ్ళు కూడా మరిచిపోయారేమో . ప్రస్తుతం మనం ఉదయం లేవగానే చూసేది వాట్సాప్లో మెసేజ్ ఎమన్నా వచ్చాయా అని.

అర్ధరాత్రి మెలుకువ వస్తే వాటర్ తాగటం కూడా మరిచిపోయారేమో. ఎవరు ఆన్లైన్లో ఉన్నారా అని చూస్తాం. యిది ప్రస్తుత ప్రపంచం తీరు. ముందు ముందు ఎటువైపు వెళ్తుందో ఏ అనర్ధాలకు దారి తీయబోతుందో. నలుగురు కలుస్తారు హోటల్కి వెళుతారు ఎవరు ఎవరితో మాట్లాడుకోరు. ఎవరి మొబైల్ లో వాళ్ళు బిజీ. ఎవరింటికైనా వెళ్లినా ఇదే పరిస్థితి. మొహాలు చూడటం మరిచిపోయారు.

మొబైల్ screen లో మునిగిపోయారు. గుడికి వెళ్తారు దేవుడిని లైవ్లో చూడకుండా, దణ్ణం పెట్టకుండా ఫొటోస్ తీసి ఇంటికొచ్చి ఫార్వర్డ్ చేసుకుంటారు. హతవిధీ. ఇపుడున్న సమస్య (అనాలో) లేక సమాజం (అనాలో), open వాట్సాప్ గ్రూపులు లేక ఫేస్బుక్ లేక యూట్యూబ్ వైరల్ అనాలో. టీవీలూ సినిమాలు పార్కులు ఇవి ఎలాగో వాట్సాప్ ఫేస్బుక్ కూడా అంతే. కాకపోతే పైవాటిలో కొంతయినా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బట్ వాట్సాప్లో ఎంటర్టైన్మెంట్ ఉన్నట్లుంటది కానీ ఉండదు. ఈ what's app ప్రపంచం అనేది ఒక మాయ ప్రపంచం.

ఇక్కడ ఎన్నో రంగులు హంగులు కనబడుతాయి. అవి నిజంకాదు అని తెలియాలంటే చాల సమయం ఖర్చు పెట్టాల్సి వస్తుంది . తర్వాత తెలిసొచ్చేది గుణపాఠమే. అందరూ అనుకునేది వాట్సాప్ గ్రూపులవల్ల relax అవుదామని, relief ఉంటుందని, సరదాగా ఉంటుందని, నలుగురితో స్నేహం పెరుగుతుంది అని, కొత్త విషయాలు తెలుస్తాయని ఇలా రకరకాల positive ఆలోచనలే ఉంటాయి. కానీ వాస్తవానికి ఈ గ్రూపులే భారమవుతాయి మనసుకి శాంతి లేకుండా చేస్తాయి మనస్పర్థలు వస్తాయి ఈర్ష్యాలు పెరుగుతాయి ద్వేషాలు పెరుగుతాయి నమ్మకాలు పోతాయి ఇలా రకరకాలుగా వింత అనుభవాలు కలుగుతాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఇవన్నీ నిజజీవితంలో కంటె ఇక్కడ ఎక్కువ గా వుంటాయి కారణం ఒకరికొకరు తెలియకపోవడం. ఇహ కథలోకి వెళితే....అనగనగా ఓ మాయా ప్రపంచములో...ఎన్నో వాట్సాఅప్ గ్రూపులు. ఆగ్రూపులో రకరకాల మనుష్యులు....రకరకాల వ్యక్తి త్వాలు...మనసత్వాలు......కొత్తగా ఒచ్చినవాళ్ళకి ఏమి అర్థంకాదు. ఎప్పటినుండో ఉన్నవాళ్లు హడావిడిగా ఏదో చేస్తూ ఉంటారు. ఎదో ఉంది ఇక్కడ అనిపించి చివరకు ఏమీలేదు అని తెలుసుకునేలా చేసేవే ఈ గ్రూపులు. క్షణాల్లో దగ్గరవుతారు అంతేవేగంగా దూరం అవుతారు. ఇక్కడ దేనికి ఒక నిర్దిష్టమైన వాల్యూ ఉండదు. ఇక్కడ విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టే ది అత్యంత విలువైన మన సమయాన్ని. ఎక్కడ మొదలవుతుందో మాత్రమే తెలుసు ఎక్కడ అంతం అవుతుందో అసలు అంతం ఉందొ లేదో కూడతెలియదు. గుంపులగోల. మందలమైకం.. సమూహాల సంద్రోహం... గ్రూపుల గందరగోళం.... గీ smartphones రాకముందల మంది ప్రశాంతంగా ఉండేవాళ్ళు.

గందులో మళ్ళీ WhatsApp, గ్రూపులు కూడా వచ్చాక, మనిషి బతుకెట్లయిపోయిందంటే, ఇగజూడు, క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదు. What's app ఒచ్చిన కొత్తల్లో contacts 100 ఉంటే, ఒక్క గ్రూపుండేది. గిప్పుడేమో 100 గ్రూపులు, ఒక్క contact ఉంది, గదికూడా self number ఆయే. ఒక్కక్షణం పక్కకిపోతే గుంపులో ఏమవుతుందో అని గుండెలో అలజడాయే. ఇహజూడు గ్రూపుగ్రూపుకి ఒక్కో లొల్లి షురువాయె. పాటల గుంపని. ఆటల గుంపని.. నవ్వుల గుంపని... కబుర్లు గుంపని.... మహిళా గుంపని..... రాగాల గుంపని...... ఇట్లా రకరకాల గుంపులనుకో గుంపంటే ఎదో అనుకునేరు గుంపంటే గ్రూపు కలిసుంటే కలదు సుఖం అన్న బాణీలో మొదలెడతారు గ్రూపులు, కలిసుందామంటారు, సహాయాలంటారు, ఒకరిగురించి ఒకరు పొగుడుకుంటారు, ఆహా ఓహో అన్న శ్రేణిలో బాగానే ఉంటాయి మొదట్లో . అంతేకాదండోయ్, మొదట్లో అన్ని గ్రూపులు బాగుంటాయి. జరంత సమయంగడిచాక, మెల్లమెల్లగా బోరైతది. గప్పుడు మళ్ళీ, చెత్, గీ గ్రూపుకాదు,

ఇంకోగ్రూపు అంటూ స్టార్ట్ చేస్తాడు ఇంకో పుల్లయ్యో, సోమయ్యో. గ్రూపులకు అలవాటు పడినవాళ్ళకి ఎన్ని గుంపులున్నా సరిపోవు. ఏ కొత్త గుంపు open అయిన వీళ్ళు ముందుంటారు జాయిన్ అవటానికి. ఒకరు జెప్పింది ఒకరికి నచ్చదాయె, కొందరేమో ఎడ్డెమంటే తెడ్డెమన్న టైపులో మాటాడుతారాయె. ఎవర్ని హర్ట్ చేయకూడదు. ఇహ గుంపు నాయకులు అదే అడ్మిన్ల్ లు. గ్రూపులు పెట్టినపుడు బాగానే ఉంటది వీళ్ళ పని. గ్రూపుల్లో లొల్లి మొదలైందా, ఇక వీళ్ళ తలప్రాణం తోకలోకి ఒస్తది సముదాయించలేక. ఐన సరే, గ్రూపులంటే వీళ్ళకి ప్రాణం, వీళ్ళ గ్రూపులకు వీళ్ళే యజమానులు. పొద్దుగాల లేస్తారు రూల్స్ పోస్ట్ చేయుడు.

గిదే వీళ్లకు సగం పని. ఇంకా సభ్యులైతే రకరకాల వాళ్ళు ఉంటారు. కవితలు రాసె వాళ్ళు జోకులు చెప్పేవాళ్ళు పోస్ట్లు పెట్టేవాళ్ళు చాటింగ్ లు చేసేవాళ్ళు వీళ్ళపని వీళ్లదే. ఒక్కోసారి గ్రూపు నియమాలు కూడా పటించుకోరు. కొంతమంది ఐతే వద్దన్నవే చేస్తారు. గ్రూపులో మాత్రం అందరూ కలిసుంటారు చాలా బాగా మాటడుకుంటారు. కానీ ఎవ్వరిని ఎవ్వరు నమ్మరు. కొంత మందికి గుంపులో ఏది post చేయాలో ఏది చేయకూడదో తెలవదు. పక్కనోడు చేశారు మనమూ చేయాలని ఒకటి. ఎక్కడికో పోవుడు copy చేయుడు ఇక్కడ post చేయుడు. పెట్టిన post నే మళ్ళీ మళ్ళీ పెట్టుడు. అసలు మనం పెట్టేవి ఎంతమంది చూస్తారు అసలు చూస్తారా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. కారణం ఇక్కడ మనం పెట్టే ఖర్చు పెద్దగా ఉండదు. అన్నీ freeనే. సమయాన్ని పెద్దగా పట్టించుకోరు.

ఏ కొత్త పోస్ట్ ఒచిన అందరికంటే ముందు నేనె పెట్టాలి అనే తపన. పక్కవాడ్ని చూసి పోటీపడటం. ఈ పోటీతత్వం real life లో ఎంతుంటుందో చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం అందరూ బిజీగా ఉంటారు. కొంతమంది అడ్మిన్ లు ఐతే ఈ గ్రూపులను రాజ్యాలుగా వాళ్ళని వాళ్ళు రాజులుగా లేక రాణులుగా భావిస్తారు. ఒక గ్రూపు మహిష్మతి రాజ్యమైతే మరోటి కుంతల రాజ్యం. ఈ గ్రూపులో సభ్యులు ఆ గ్రూపులోకి వెళ్లకూడదు అందులోనే వాళ్ళు ఇందులోకి రాకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చారా అడ్మిన్ల మధ్య యుధభేరి ఢంకాభేరి లు మొగుతాయి. ఎం జరిగిందో తెలియకముందే గ్రూపుల్లోనుండి తీసిపడేస్తారు. వీళ్ళకి సభ్యుల మనోభావాలు తో సంభంధం లేదు. వీళ్ళ ఇగో నే వీళ్ళకి ముఖ్యం. కొందరు ఐతే seasonal ఉంటారు. కొత్తవాళ్ళు రాగానే పాతవాళ్ళకి hand ఇవ్వటం. వీళ్ళు friends మాటలకంటే శత్రువుల మాటలు బాగా నమ్ముతారు. కొంతమంది ఐతే గ్రూపులో ఇష్టానుసారం కొట్టుకుంటారు అర్థం పర్థం లేకుండా personal revenge అంతా గ్రూపుల్లోనే చూపిస్తారు. అందరూ చూస్తున్నారు అనికూడా ఆలోచించరు పైగా వీళ్ళ యుద్దానికి ఎవ్వరు మాట్లాడలేదు అని మిగతవారిని తప్పు పట్టటం. కొంతమంది ఐతే వాళ్ళు ఊహించిందే నిజాలనుకున్టారు. వాళ్ళ అనుమానమే నిజమంటారు.

Roumers బాగా నమ్ముతారు. అత్త మీద కోపం దుత్తమీద బాగా చూపిస్తారు వీళ్ళు. కొంతమంది ఐతే అడ్మిన్ position లో ఉండి కూడా సాటి అడ్మిన్ తప్పు చేసినా తప్పు అని చెప్పరు. కొంతమంది అడ్మిన్ల ఐతే మేమె మోనార్కులం అన్న టైపులో మాటాడుతారు. వీళ్ళు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటారు. ఎవరేం చెప్పిన వినరు. మెం చెప్పిందే correct అంటారు. పోనీ ఇన్ని గుంపులు పెట్టినారు కదా అన్నింటిలో వేరు వేరు సభ్యులుంటారా అంటే దాదాపు common members ఏ ఎక్కువమంది ఉంటారు. కాకపోతే గుంపులు పేర్లు వేరు అంతే. ఇది జాలదు అన్నట్లు మల్లి partyలు. Politicsలో కూడా అన్ని partyలుండవు. దేశ ప్రపంచ రాజకీయాలు అన్ని ఇక్కడే ఉంటాయి. దేనికబ్బా ఇదంతా అని ఆలోచిస్తే ఎవ్వరిదగ్గర సమాధానం ఉండదు. కొంతమంది ఐతే గీ గ్రూపుల మీదనే బ్రతికేస్తుంటారు.

24 గంటలు ఇదే పని. కొంతమంది admins ఐతే rules పెడతారు. వీళ్లు follow అవ్వరు. చెప్ప పెట్టకుండా left అయ్యేవాళ్ళని వద్దన్నా తీసుకొచ్చి add చేస్తుంటారు. ఎక్కడ లేని రూల్స్ అన్ని మాటాడుతారు. కొంతమంది silent గా ఉంటారండి గ్రూపులో. వీళ్ళు ప్రతి గ్రూపులో ఉంటారు. వీళ్ల పని వీళ్లదే. కొంతమంది సభ్యులు అయితే sincere గా టైం spend చేస్తుంటారు గ్రూపులమీద. వీళ్లేంత sincere అంటే పాపం ఇంట్లో పనికుడా postpone చేస్తుంటారు. వీళ్ళని నమ్ముకున్న కుటుంభ సభ్యులు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు. ఈ గ్రూపుల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే seriousగా తీసుకునే sillyness. అంటే ఎక్కువ టైం spend చేస్తూ కూడా seriousness ఉండదు. దానివల్ల importance తెలియదు. ఈ impact తెలియకుండా నిజాజీవితం మీద కూడా పడుతుంది.

ఇక employees పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళు officeలో ఉన్న విషయం కూడా మరిచిపోయి పాపం గుంపులో involve అవుతూ ఉంటారు. పైకి ఎంత cover చేసిన కొంతవరకు divert అవుతూనే ఉంటారు వాళ్ళు. ఇగ కొంతమంది ఆడవాళ్ళ పరిస్థితి అయితే తలుచుకుంటే బాధనిపిస్తది. ఇంట్లో వంట పనులన్న చేస్తారో లేదో. చేస్తారంటే అస్సలు జెయ్యరని కాదు. మనసు ఇటు పీకుతావుంటాది కదా. Focus ఎక్కువ జేయలేరు. ఇహ ఉద్యోగం చేసే ఆడవాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో ఉహించుకోండిరి. ఇహ కొంతమంది ఐతే జబర్దస్త్ buildup బాబాయ్ సీను టైపులో ఉంటారు. వీళ్ళు చాలా rare. దాబులెక్కువ విషయం తక్కువ. వీళ్ళకి కనిపించే గర్వం కనపడని పొగరు రెండూ ఉంటాయి. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళనేవరైన పొగిడితేనే వాళ్ళని పొగుడుతారు.

వీళ్ళతో ఎవరైనా మాట్లాడితే నే వీళ్ళు మాటాడుతారు. చిన్నమాటన్న ఉన్నమాటన్న రోషంఎక్కువ. వీళ్ళు అందరితో close గా ఉంటారుకాని ఎవరితో close గా ఉండరు. అపుడే భూమిలోంచి ఒచిన fresh మొక్కల్లాగా delicateగా ఫీల్ అవుతుంటారు . అందరుకుడా వీళ్ళని గట్లానే అనుకోవాలి వీళ్ల ఆశ. ఎక్కడా నిలకడగా ఉండలేరు. గీ గుంపుళ్ళో ఎదో ఉంది అనుకుని ఏమిలేదని తెలుసుకునే సరికి చాలా సమయం దాటిపోయుంటాది. దీన్నే రంగుల మాయ ప్రపంచం అంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవర్ని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో తెలియదు. అందరూ బానే ఉంటారు మళ్ళీ తేడాగా ఉంటారు. ఇట్టే బంధం ఏర్పడిపోతుంది ఇట్టే తెగిపోద్ది.

మనిషి నిజజీవితంలోనే చాలా బంధాలు నిలబడట్లేదు. ఇహ గీ wapp బంధాలు ఎంత వరకు నిలబడతాయి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో బోలెడు గుంపులు. ఒక ఆకాశశీతమ్మ రాణి గిట్ల చేపిందంట. ఈ Wappలో గెవ్వరూ గెవ్వరికి సొంతం గారని. ఆ దీనర్థం గిప్పుడే తెలియదులే. మనల్ని మనం గెంత సందాయించుకున్న ఒక్కమాట మాత్రం నిజమప్ప. గీ గ్రూపులొచ్చాక personal lifeలో ఎంతో అంత మార్పొచ్చిందని చెపోచు. Either positive or negative. ఈ గ్రూపుల గురించి చాలా కధలు చెప్పొచ్చు... కధ నడుస్తుంది.... మరెపుడైనా తరువాయి భాగం...

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి